ఏపీ ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్త!
తీవ్రమైన ఉక్కపోత, తాపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ రాష్ట్ర ప్రజలకు..
ap weather update
ఏపీ ప్రజలు రానున్న రోజుల్లో జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మాడు పగిలే ఎండలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తీవ్రమైన ఉక్కపోత, తాపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ రాష్ట్ర ప్రజలకు వడగాల్పులపై హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగ్నేయ నుంచి నైరుతి దిశలో గాలులు వీస్తుండటంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో రాబోయే 3 రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
వివిధ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ వేసవి సగటు ఉష్ణోగ్రతల కంటే 2-4 డిగ్రీల వరకూ అధికంగా నమోదవుతాయని అంచనా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన ఎండలు, వడగాల్పులు ఉండనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిసింది.