Srikakulam : సిక్కోలు.. గజగజ
ఉత్తరాంధ్రలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో చెట్లు విరిగి పడుతున్నాయి
ఉత్తరాంధ్రలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో చెట్లు విరిగి పడుతున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. వాయుగుండం ఒడిశా - గోపాల్ పూర్ మధ్య తీరం దాటడంతో ఈ ప్రభావం ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాపై పడింది. నదులు, వాగులుఉప్పొంగుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షాలకు...
ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు గొట్ట బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతుంది. కొన్ని గ్రామాలకు రాకపోకలు స్థంభించిపోయాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నాగావళి, వంశధార నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పంటలు పూర్తిగా నీట మునిగాయి. విద్యుత్తు స్థంభాలు గాలికి పడిపోయాయి. పరిస్థితి బీభత్సంగా ఉంది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.