కారు ఉండగానే రోడ్డు వేసిన ఈ చిత్రం చూశారా?
బాపట్లలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఇంటిముందు పార్క్ చేసిన కారుని అలాగే ఉంచేసి కాంక్రీట్ రోడ్డును కాంట్రాక్టర్ వేశారు
బాపట్లలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఇంటిముందు పార్క్ చేసిన కారుని అలాగే ఉంచేసి కాంక్రీట్ రోడ్డును కాంట్రాక్టర్ వేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ గా మారింది. బాపట్ల జిల్లా దేశాయిపట్నంలో కొత్తగా సిమెంట్ రోడ్డు వేస్తున్న సందర్భంలో రోడ్డుపక్కనే ఉన్న కారు ఆ వాహనం తీయాలని ఎన్నిసార్లు చెప్పినా సరే తీయకుండా కారు తాళం వేసి వెళ్లిపోయారని అధికారులు చెబుతున్నాు.
తాళం లేకపోవడంతో...
కారు తీయడానికి తాళం లేకపోవడంతో కారుని అలాగే ఉంచి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేశామంటున్న కాంట్రాక్టర్ చెబుతున్నారు. అయితే కారును అలా ఉంచి రోడ్డు నిర్మాణం చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కారు యజమానిపైపోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది కదా? లేకుండా అక్కడే కారు ఉండగా రోడ్డు వేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.