చెవిరెడ్డి ఇంట్లో సిట్ సోదాలు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో తుమ్మలగుంటలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట్లో సిట్‌ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.

Update: 2025-09-04 05:57 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో తుమ్మలగుంటలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట్లో సిట్‌ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేస్తున్న సిట్‌ అధికారులు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఏమైనా ఆధారాలు లభిస్తున్నాయన్న అభిప్రాయంతో సోదాలు నిర్వహిస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంటికి నిన్న తాళం వేసి ఉండటంతో సిట్‌ అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.

ఏపీ లిక్కర్ స్కామ్ లో...
ఈరోజు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట్లో కొనసాగుతున్న సిట్‌ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. గత డెబ్భయి తొమ్మిది రోజులుగా విజయవాడ జిల్లా జైలులో జ్యుడీషియల్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రిమాండ్‌లో ఉన్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ38 చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఏ39 చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిగా ఉన్నారు. అందువల్లనే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి


Tags:    

Similar News