ఏపీ ప్రజలకు వార్నింగ్

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీ ప్రజలను హెచ్చరించింది. సోమవారం 36 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది

Update: 2024-04-01 04:10 GMT

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజలను హెచ్చరించింది. సోమవారం 36 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, వడగాల్పులు వీయడంతో వడదెబ్బ తగిలే అవకాశముందని తెలిపింది.

నేడు, రేపు...
రేపు మంగళవారం 37 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశముందని హెచ్చరించారు. ఇక ఎండలు ముదిరిపోవడంతో నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News