హైదరాబాద్ నుంచి స్టార్ లైనర్ నాన్ ఏసీ బస్సులు

హైదరాబాద్ నుంచి ఏపీలోకి 15 ముఖ్య పట్టణాలకు స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ఎపీఎస్ ఆర్టీసీ కొన్ని పట్టణాలకు ప్రయోగాత్మకంగా నడిపింది.

Update: 2023-08-28 17:11 GMT

హైదరాబాద్ నుంచి స్టార్ లైనర్ నాన్ ఏసీ బస్సులు

హైదరాబాద్ నుంచి ఏపీలోకి 15 ముఖ్య పట్టణాలకు స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ఎపీఎస్ ఆర్టీసీ కొన్ని పట్టణాలకు ప్రయోగాత్మకంగా నడిపింది. వీటికి ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరగడంతో ఈ సేవల్ని మరింతగా విస్తరిస్తూ, ఆదోని, చిత్తూరు, కడప, మనదపల్లి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కందుకూరు, నెల్లూరు, వెంకటగిరి, కనిగిరి, చిలకలూరిపేట, విజయవాడ, మచిలీపట్నం, తెనాలికి నడుపుతున్నారు. బీహెచ్‌ఈఎల్, మియాపూర్ నుంచి బయల్దేరే స్టార్ లైన్ బస్సులు బస్సులు చందానగర్, మియాపూర్, అల్వీన్ క్రాస్ రోడ్స్, నిజాంపేట, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, ఎస్ఆర్‌నగర్, అమీర్‌పేట్, టెలిఫోన్ భవన్, ఎంజీబీఎస్, ఎల్బీనగర్ బస్ స్టాపుల్లో ఆగుతాయి. ఈసీఐఎల్ నుంచి బయల్దేరే బస్సులు మౌలాలి హౌసింగ్ బోర్డ్ కాలనీ, మల్లాపూర్, నాచారం, హబ్సిగూడ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీ నగర్ మీదుగా వెళతాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవచ్చని తెలిపారు అధికారులు.

ఏపీఎస్‌ఆర్టీసీ నడుపుతున్న ఈ స్టార్ లైనర్ బస్సులు 2+1 స్లీపర్ కోచ్‌గా ఉన్నాయి. ప్రతి బస్సులో 30 కుషన్ సాఫ్ట్ బెర్త్‌‌లు..ప్రయాణికుల కోసం అధునాతన సౌకర్యాల కూడా అందుబాటులో ఉన్నాయి. బస్సులో ప్రయాణికుల కోసం ఛార్జింగ్ పోర్ట్స్, రీడింగ్ లాంప్స్, లగేజీ ర్యాక్స్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశరాు. అలాగే బస్సు ఆడియో కోచ్‌.. రాష్ట్రంలో దాదాపు ప్రతి జిల్లా నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు నడపుతున్నారు.

Tags:    

Similar News