Tirumala : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూతము రారండి
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేట నుంచి జరగనున్నాయి. నేటి నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 2వ తేదీ వరకూ జరగనున్నాయి
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఒక్కరోజు హాజరయినా చాలు జన్మధన్యమయినట్లే భావిస్తారు. అందుకే దసరా పండగకు ముందు ప్రారంభమయ్యే శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమలకు జనం పోటెత్తతుతారు. మాడవీధుల్లో స్వామివారు ఉదయం, సాయంత్రం వేళలో వాహనసేవల్లో విహరిస్తారు. వాహన సేవలను చూసి తరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
గరుడ వాహనసేవకు...
శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా గరుడ వాహన సేవకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనాలను కూడా తిరుమల కొండపైకి తిరుమల తిరుపతి దేవస్థానంఅధికారులు అనుమతించరు. గరుడ వాహనసేవఈ నెల 28వ తేదీన వచ్చింది. ఈరోజు లక్షలాదిమంది భక్తులు రావడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా అవసరమైన చర్యలు తీసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు.
నేటి నుంచి...
ఈ నెల 24 వతేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 2వ తేదీ వరకూ జరగనున్నాయి. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకూ వాహన సేవలు ఉంటాయి. వాహనసేవలసమయంలో మాడవీధుల్లో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. భక్తులందరికీ మాడవీధుల్లో కూర్చుని వాహన సేవలు తిలకించేలా ఏర్పాట్లుచేస్తున్నారు
వాహన సేవల వివరాలివే :
24/09/2025 సాయంత్రం 05:43 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.
25/09/2025 – ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం
26/09/2025 – ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం
27/09/2025 - ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం ఒంటి గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం
28/09/2025 – ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి గరుడ వాహనం
29/09/2025 - ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం
30/09/2025 - ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం
01/10/2025 - ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం
02/10/2025 - ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం.