Tirumala : నేడు పెద శేష వాహనంపై మలయప్ప స్వామి

తిరుమలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారం కానున్నాయి. మలయప్ప స్వామి పెద శేష వాహనంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు

Update: 2025-09-24 02:28 GMT

తిరుమలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారం కానున్నాయి. నిన్న బ్రహ్మోత్సవాలకు సంబంధించి అంకురార్పణ జరిగింది. నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశముంది. వచ్చే నెల రెండో తేదీ వరకూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ధ్వజారోహణం అనంతరం...
శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం 5.43 గంటల నుంచి 6.15 గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటల నుంచి పదకొండు గంటల వరకూ మలయప్ప స్వామి పెద శేష వాహనంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


Tags:    

Similar News