మోదీ పర్యటనలో భద్రత లోపం

ప్రధాని మోదీ పర్యటన భద్రతా లోపంపై ఎస్పీజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది.

Update: 2022-07-04 11:55 GMT

ప్రధాని మోదీ పర్యటన భద్రతా లోపంపై ఎస్పీజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని పర్యటనలో భద్రతా లోపాలు కన్పించాయి. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో ప్రధాని మోదీ బయలుదేరిన సందర్భంలో నల్ల బెలూన్లు వదిలారు. ఆ బెలూన్లు ప్రధాని హెలికాప్టర్ కు సమీపంలోకి వచ్చాయి. దీంతో ఏపీ పోలీసులు అప్రమత్తమై దీనిపై విచారణ జరిపి ఇందుకు కారణమైన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

హెలికాప్టర్ కు సమీపంలో...
హెలికాప్టర్ లో ప్రధాని మోదీతో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్ కూడా పర్యటిస్తున్నారు. భీమవరం వెళుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో రాష్ట్ర పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. గన్నవరానికి అతి సమీపంలో ఈ బెలూన్లను ఒక మేడ పై నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు వదిలినట్లు తేలింది. దీనిపై ఎస్పీజీ రాస్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. అయితే బెలూన్లలో ఎలాంటి హైడ్రోజన్ లేదని, నోటితో ఊది వదిలారని పోలీసులు చెబుతున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది.


Tags:    

Similar News