High Alert: తుఫాన్‌ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులు

భారీ నుంచి అతి భారీ వర్షాలు, డిసెంబరు 4న ఒకట్రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు

Update: 2023-12-04 10:27 GMT

బంగాళాఖాతంలో కొనసాగుతున్న మిచౌంగ్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఇది మరింత బలపడే అవకాశాలున్నాయని, క్రమంగా ఉత్తర దిశగా ఏపీ తీరానికి సమాంతరంగా పయనించి డిసెంబరు 5 మధ్యాహ్నం నాటికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య బాపట్లకు సమీపంలో తీరం దాటనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది. తీవ్ర తుపాను నేపథ్యంలో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. డిసెంబరు 4, 5 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, డిసెంబరు 4న ఒకట్రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. డిసెంబరు 6న ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. రాయలసీమలో డిసెంబరు 4న చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

తుఫాన్‌ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. బాపట్ల – కాటమనేని భాస్కర్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ – జయలక్ష్మి, తూర్పు గోదావరి – వివేక్‌ యాదవ్‌, కాకినాడ – యువరాజ్‌, ప్రకాశం – ప్రద్యుమ్న, నెల్లూరు – హరికిరణ్‌, తిరుపతి – జె.శ్యామలరావు, పశ్చిమ గోదావరి – కన్నబాబును నియమించారు ఉన్నతాధికారులు. ఆయా జిల్లాల్లో ప్రజలను అప్రమత్తం చేసి ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా చూసేందుకు ప్రత్యేకాధికారులు పని చేయనున్నారు.


Tags:    

Similar News