ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం తనిఖీలు చేశారు

Update: 2025-05-14 04:46 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం తనిఖీలు చేశారు. హైదరాబాద్ లో ఈ సోదాలు జరిగాయి. ఏ-32 నిందితుడు కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌ డైరెక్టర్‌గా ఉన్న కంపెనీల్లో సిట్‌ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లో ని మొత్తం ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేసిన సిట్‌ అధికారులు నేడు కూడా తనిఖీలు చేసిన్నట్లు తెలిసింది.

మైసూరులో అరెస్ట్ చేసి...
నాటికల్, ఐబాట్, స్కూబీ ల్యాబ్స్‌, క్రిస్టల్, ఏక్యూ స్క్వేర్ కంపెనీల్లో తనిఖీలు చేసిన సిట్‌ కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. త్వరలో మరికొందరికి నోటీసులు సిట్‌ అధికారుల ఇవ్వనున్నట్లు తెలిసింది. మరొకవైపు మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉన్న గోవిందప్పను నిన్న మైసూరులో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నేడు సిట్ కార్యాలయానికి తీసుకు వస్తున్నారు.





















Tags:    

Similar News