రాయలసీమలోకి ఎంట్రీ ఇచ్చిన రుతుపవనాలు
సోమవారం ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి
సోమవారం ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మిగిలిన ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రేపో మాపో తెలంగాణకు కూడా రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని తెలిపింది.
భారీ వర్షాలు...
గత ఏడాది అంటే 2024లో జూన్ 2న ఆంధ్రప్రదేశ్ లో రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ ఏడాది మే ఇరవై ఆరోతేదీనే ప్రవేశించాయి. అంటే దాదాపు వారం రోజుల ముందు ఏపీలోకి ప్రవేశించాయి. రుతుపవనాల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. వర్షాలు ముందే రావడంతో ప్రజలు ఈ ఏడాది ఎండ వేడిమి నుంచి తప్పించుకున్నట్లయింది.