వందేభారత్ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్
వందేభారత్ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
వందేభారత్ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-తిరుపతి సహా ఏడు మార్గాల్లో నడిచే వందేభారత్ రైళ్ల కోచ్‌ల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. దీంతో ఎక్కువ మంది ప్రయాణికులు వందేభారత్ రైళ్లలో ప్రయాణించే అవకాశముంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది.
కోచ్ ల సంఖ్య పెంచుతూ...
వందే భారత్ రైళ్లలో పదహారు కోచ్‌ల రైలును 20 కోచ్‌లకు పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎనిమిది కోచ్‌ల వందేభారత్ రైలు 16 కోచ్‌లకు అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్‌లో ఇకపై ఇరవై కోచ్‌లు రానున్నాయి. దీంతో అధిక సంఖ్యలో ప్రయాణం చేసే వీలుంది.