సత్యసాయి జిల్లాలో జవాను భూమి కబ్జా.. జమ్మూ నుంచి సెల్ఫీ వీడియో విడుదల
శ్రీసత్యసాయి జిల్లాలో ఆర్మీ జవాన్ కు చెందిన భూమిని కొందరు ఆక్రమించారు
శ్రీసత్యసాయి జిల్లాలో ఆర్మీ జవాన్ కు చెందిన భూమిని కొందరు ఆక్రమించారు. జిల్లాలోని హుదుగూరులో జవాన్ భూమి కబ్జాకు గురయ్యింది. తన భూమి కబ్జా చేశారని జమ్ము నుంచి జవాన్ వీడియోను విడుదల చేశారు. కబ్జాదారుల నుంచి తన భూమిని కాపాడాలంటూ కూటమి ప్రభుత్వాన్ని జవాన్ నరసింహమూర్తి వేడుకున్నారు.
సెల్ఫీ వీడియోలో...
సెల్ఫీ వీడియోలో జవాన్ నరసింహమూర్తి వేడుకున్న ఘటన వైరల్ గా మారింది. భూమి తనదేనని కోర్టు కూడా తీర్పు ఇచ్చిందన్న జవాన్ నరసింహమూర్తి కోర్టు తీర్పును రక్షించాల్సిన రెవెన్యూ అధికారులు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. న్యాయం చేయాలని నారా లోకేష్, పవన్ కల్యాణ్ ను జవాన్ నరసింహమూర్తి వేడుకున్నారు.