నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం

నేడు ఒంటిమిట్టలో సాయంత్రం సీతారాముల కల్యాణోత్సవం జరగుతుంది

Update: 2025-04-11 02:14 GMT

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలతో “ ఒంటిమిట్ట‌కు త‌ర‌లివ‌చ్చిన అయోధ్య‌” అన్నట్టు శోభను సంతరించుకుంది. ఏకశిలానగరంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఎలక్ట్రికల్, గార్డెన్ విభాగాలు చేపట్టిన పుష్పాలంకరణ, విద్యుత్‌ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయ సముదాయం, కళ్యాణ వేదిక వద్ద అద్భుతమైన ట్రస్ లైటింగ్‌తో ఏర్పాటు చేశారు. దేవాలయం, కల్యాణ వేదికలను కలుపుతూ రహదారుల వద్ద వివిధ దేవతామూర్తులతో కూడిన 10 పెద్ద, 30 చిన్న విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇందులో లక్ష్మీ వెంకటేశ్వర, సీతా రామ, శ్రీరామ పట్టాభిషేకం, మహా విష్ణువు, విశ్వరూపం, దశావతారాలు వంటి పెద్ద కటౌట్లు ఉన్నాయి.

విద్యుత్తు దీపాలంకరణలతో....
అలాగే అష్టలక్ష్ములు తుంబురుడు అన్నమాచార్యులు వంటి చిన్న కటౌట్లు ఏర్పాటు చేశారు. గోపురం దీపాలంకరణ, ప్రాకారం చుట్టుపక్కల దీపాలంకరణ, శ్రీవేంకటేశ్వర స్వామి త్రీ డైమెన్షనల్ దీపాలంకరణ, ఆలయం వద్ద ఒకటి, కల్యాణ వేదిక వద్ద మరొకటి విద్యుత్ డైమండ్ కిరీటాల నమూనా భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దాదాపు 100 మంది కార్మికులు ఈ విద్యుత్ అలంకారాలను తయారు చేయడానికి నెల రోజుల పాటు రాత్రింబవళ్ళు శ్రమించారు.
భారీ భద్రత...
ఈరోజు సాయంత్రం సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు సీతా రామ కల్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ప్రధాన ఆలయానికి సమీపంలో రెండు మరియు కల్యాణ వేదిక లోపల, చుట్టుపక్కల 23 ఎల్ ఈడి స్క్రీన్‌లుసిద్ధంగా ఉన్నాయి. నేటి సాయంత్రం ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవం జరగుతుంది. పట్టువస్త్రాలు సీఎం చంద్రబాబు సమర్పించనున్నారు. వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. కల్యాణోత్సవానికి 70 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తులకు ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాలు అందించనున్నారు. 300మంది టీటీడీ విజిలెన్స్, 3 వేల మంది పోలీసులతో భద్రతతో పాటు సీసీకెమెరాలు, డ్రోన్లతో భద్రతపర్యవేక్షణ చేస్తున్నారు.


Tags:    

Similar News