Breaking : లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం... ఇద్దరు అరెస్ట్

మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, జగన్ ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అఅధికారులు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.

Update: 2025-05-16 14:43 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, జగన్ ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అఅధికారులు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. గత మూడు రోజుల నుంచి సిట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ జరుపుతున్నారు. ఈరోజు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు ప్రకటించారు.

ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో...
మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, జగన్ ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిలు తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటీషన్ ను డిస్మిస్ చేసింది. విచారణ కీలక దశలో ఉన్నసమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెప్పింది. దీంతో సిట్ అధికారులు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లే ప్రకటించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 


Tags:    

Similar News