తప్పి పోయిన శివస్వాములు భద్రంగానే
నల్లమల అటవీప్రాంతంలో శివస్వాములు తప్పిపోయారు. ఎనిమిది గంటల పాటు అటవీప్రాంతంలో నరకయాతన అనుభవించారు
నల్లమల అటవీప్రాంతంలో శివస్వాములు తప్పిపోయారు. ఎనిమిది గంటల పాటు అటవీప్రాంతంలో నరకయాతన అనుభవించారు. శివరాత్రి సందర్భంగా శ్రీశైలం లో జరిగే బ్రహ్మోత్సవాలుకు కాలినడకన శివమాల ధరించి భక్తులు కాలినడకన బయలుదేరారు. దాదాపు ముప్ఫయి మంది తో కూడిన ఈ బృందం దారి మధ్యలో తప్పిపోయాయి.
ఏడుగురు అటవీ బృందదంలో...
అయితే ఈ బృందంలో నుంచి ఏడుగురు తప్పిపోయారు. బృందం మార్గమధ్యంలో తప్పిపోవడంతో మిగిలిన శివస్వాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటవీ ప్రాంతంలో తప్పిపోయిన ఏడుగురు శివస్వాములను అటవీ శాఖతో పాటు పోలీసు అధికారులు కలసి సంయుక్తంగా ఏడుగురిని కాపాడారు. దారితెలియక ఒక చోట ఉన్నవారిని రక్షించి తీసుకు వచ్చారు.