Andhra Pradesh : టీటీడీ ఈవోగా మళ్లీఅనిల్ కుమార్ సింఘాల్ ... ఏపీలో ఐఏఎస్ బదిలీలు.. ఆయననే ఎందుకంటే?
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం పదకొండు మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించింది. గతంలోనూ ఆయన టీటీడీ ఈవోగా పనిచేశారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును జీఏడీ ముఖ్యకార్యదర్శిగా నియమించారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ పలు సంస్కరణలను తిరుమలలో ప్రవేశపెట్టారు. మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
బదిలీలు చేస్తూ...
రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు, రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేశ్ కుమార్ మీనా, మైనారిటీ సంక్షేమ కార్యదర్శిగా శ్రీధర్, అటవీ పర్యావరణ శాఖ కాంతిలాల్ దండేను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్, కుటుంబం సంక్షేమ శాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ప్రవీణ్ కుమార్, పరిశ్రమలు, కార్మిక శాఖ కమిషనర్ గా శేషగరిబాబు, రెవెన్యూ (ఎండోమెంట్) కార్యదర్శిగా హరి జవహర్ లాల్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. మరికొందరు ఐఏఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యే అవకాశముందని అంటున్నారు. అదే సమయంలో ఈరోజు సాయంత్రం కాని, రేపు ఐపీఎస్ అధికారుల బదిలీల ఉత్వర్వులు వెలువడే అవకాశముందని చెబుతున్నారు.