కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు మరణించారు

Update: 2025-04-18 07:06 GMT

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు మరణించారు. ట్రక్కును బొలేరో వాహనం ఢీకొనగా అక్కడికక్కడే నలుగురు మరణించారని తెలిసింది. సంఘటన స్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోస్టు మార్టం తర్వాత బంధువులకు అప్పగించనున్నారు.

అతి వేగమే...
ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స జరుపుతున్నారు. అయితే మృతి చెందిన వారు ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతానికి చెందిన వారన్నది ఇంకా పోలీసులు గుర్తించలేదు. అతి వేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. పోలీసులు కేు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News