నేడు పోలీస్ కస్టడీకి పీఎస్ఆర్
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును నేడు సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును నేడు సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ముంబయి నటిని వేధించిన కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన పీఎస్ఆర్ ఆంజనేయులు కు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అయితే ఈ కేసులో విచారించడానికి తమ కస్టడీకి అనుమతివ్వాలని కోర్టును ఆశ్రయించగా అందుకు అనుమతి లభించింది.
మూడు రోజులు పాటు...
దీంతో పీఎస్ఆర్ ఆంజనేయులును విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీలోకి తీసుకోనున్న సీఐడీ ఆయనను విచారణ చేయనుంది. పీఎస్ఆర్ ఆంజనేయులును మూడు రోజుల పాటు సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాదుల సమక్షంలో విచారణజరపపనున్నారు.