నేడు పీఎస్ఆర్ కు వైద్య పరీక్షలు

నేడు సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు

Update: 2025-04-23 03:25 GMT

నేడు సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులను కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకు వచ్చిన సీఐడీ పోలీసులు పీఎస్ఆర్ ఆంజనేయులును నిన్న ఏడు గంటలపాటు విచారించిన సీఐడీ అధికారులు నేడు న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు.

కోర్టులో హాజరుపర్చనున్న...
రాత్రంతా మొత్తం సీఐడీ కార్యాలయంలోనే ఉన్న ఆంజనేయులుకు నేడు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చనున్నారు. ముంయి నటి వేధింపుల కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనేక దఫాలుగా విచారించారు. న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన తర్వాత తిరిగి కస్టడీకి కోరే అవకాశముంది. ముంబై నటిపై అక్రమ కేసు బనాయించిన కేసులో నిందితుడిగా పీఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు.


Tags:    

Similar News