Pawan Kalyan : పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనల షురూ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది

Update: 2025-10-07 04:32 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఈనెలలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ జిల్లాల పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల పార్టీ శాసనసభ్యులు, ఎంపీలతో సమావేశమయిన పవన్ కల్యాణ్ తాను జిల్లాల పర్యటనకు వస్తానని తెలిపారు.

క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే...
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కల్యాణ్ పర్యటనలు సాగనున్నాయి. జిల్లాల పర్యటన షెడ్యూల్‌ ఉపముఖ్యమంత్రి కార్యాలయం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తొలుత పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం వెళ్లనున్న పవన్‌కల్యాణ్‌ అస్వస్థతకు గురైన విద్యార్థుల గురుకుల పాఠసాలను పరిశీలించనున్నారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. తర్వాత ప్రకాశం జిల్లాలోనూ పవన్ పర్యటన ఉండనుంది.


Tags:    

Similar News