నేడు గాయత్రిదేవిగా అమ్మవారు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి

Update: 2022-09-28 03:21 GMT

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు రెండో రోజు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. గాయత్రీదేవి ఉపాసన చేసిన వారికి బుద్ధి తేజోవంతమవుతుందని పండితులు చెబుతున్నారు.

నైవేద్యం....
ఈరోజు దుర్గాదేవిని కాషాయం లేదా నారింజ రంగు చీరతో భక్తులకు దర్శనమిస్తారు. కొబ్బరి అన్నం, కొబ్బరి పాయసాన్ని నైవేద్యంగా పెడతారు. భక్తుల రద్దీ ఉదయం నుంచే ఎక్కువగా ఉండటంతో క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా పోలీసులు, ఆలయ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News