Tirumala : ఈరోజు తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. స్వామి దర్శనం?

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తుపాను ప్రభావంతో కొంత భక్తులు రద్దీ గతంలో కంటే తగ్గింది

Update: 2025-10-27 03:06 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తుపాను ప్రభావంతో కొంత భక్తులు రద్దీ గతంలో కంటే తగ్గింది. సోమవారం కూడా కావడంతో భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. తిరుమలకు గత కొద్ది నెలల నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు, మండు టెండలను లెక్క చేయకుండా తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం కూడా ఈ ఏడాది భారీగా పెరిగింది. అయితే భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

ఆధ్యాత్మికత పెరిగి...
తిరుమలకు భక్తులు నిరంతరం రావడం ఇప్పటి నుంచి కాదు.. చాలా ఏళ్ల క్రితమే మొదలయింది. ఆధ్యాత్మికత భావం పెరగడంతో పాటు పండగలు, పుట్టినరోజులు, పెళ్లిళ్ల రోజులు వచ్చినా తిరుమలేశుడిని దర్శించుకునేందుకు తరలి వస్తుంటారు. దీంతో దర్శన ప్రక్రియలో ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మార్పులను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేపడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సీజన్ తో సంబంధం లేకుండా భక్తుల రద్దీ తిరుమలకు పెరుగుతుంది.
ఎనిమిది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఎనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులు శ్రీవారి దర్శనం కోసం పన్నెండు గంటల సమయం వేచి చూడాల్సి వస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 80,021 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,894 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.90 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News