Tirumala : తిరుమలకు ఎప్పుడు వెళితే దర్శనం సులువుగా దొరుకుతుందో తెలుసా?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారమయినా భక్తుల రద్దీ తగ్గలేదు

Update: 2025-10-23 03:25 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారమయినా భక్తుల రద్దీ తగ్గలేదు. కార్తీక మాసం కావడంతో ఈ నెలంతా భక్తులతో తిరుమల కిటకిటలాడనుందని టీటీడీ అధికారులు తెలిపారు. కార్తీక మాసంలో తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకుంటే శుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు. గత కొన్ని నెలలుగా తిరుమలలోభక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది మే 15వ తేదీన ప్రారంభమైన భక్తుల రద్దీ ఇప్పటి వరకూ ఏ మాత్రం తగ్గలేదు. దీంతో తిరుమలకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

నేడు సేవా టిక్కెట్లను...
ఈరోజు తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్ లైన్ లో ఈరోజు జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేయనుంది. ఆర్జిత సేవా టిక్కెట్లను ఉదయం పది గంటలకు విడుదల చేయనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదలవుతాయి. రేపు ఉదయం శ్రీవాణి దర్శన టిక్కెట్లను విడుదల చేయనుంది. రేుపు మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దర్శన టిక్కెట్లను, ఎల్లుండి ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
పదిహేను గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల పాటు దర్శనం కోసం వేచి ఉండాల్సి వస్తుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,853 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,551 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.47 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News