Tirumala : జోరున వర్షం... అయినా భక్తుల రద్దీ మాత్రం?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

Update: 2025-10-22 02:46 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం కానుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. భారీ వర్షాలు పడుతున్నా లెక్క చేయకుండా తిరుమలకు భక్తులు చేరుకుని స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుమలలో నిన్నటి నుంచి భారీ వర్షం పడుతుంది. అయినా భక్తులు వానను సయితం లెక్క పెట్టకుండా స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

ఆన్ లైన్ లో ఆర్జిత సేవ టిక్కెట్లు...
రేపు ఆన్లైన్లో జనవరి నెల ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను విడుదల టీటీడీ చేయనుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కార్తీక శోభను తిరుమల సంతరించుకుంది. ఈ మాసంలో తిరుమలేశుడిని దర్శించుకుంటే శుభప్రదమని భక్తులు నమ్ముతారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో కి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 76,343 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 18,768 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.34 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News