Tirumala : దీపావళికి తిరుమల కిటకిటలాడుతుందిగా.. దర్శనసమయం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వరస సెలవులు రావడంతో నేడు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది

Update: 2025-10-20 02:48 GMT

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వరస సెలవులు రావడంతో నేడు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శని, ఆది, సోమవారాలు సెలవు దినాలు కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. తిరుమల వీధులన్నీ భక్త జనులతో సందడిగా మారాయి. తిరుమల వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. ఈరోజు దీపావళి పండగ కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలను దర్శించుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆర్జిత సేవలు రద్దు...
దీపావళి రోజు కావడంతో నేడు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. ఏకాంతసేవలను చేయనున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్వామి వారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంటున్నారు. అలిపిరి టోల్ గేట్ నుంచే తిరుమలలో రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. వసతి గృహాల దొరకడం కూడా ఆలస్యమవుతుందని భక్తులు చెబుతున్నారు. అయితే కంపార్ట్ మెంట్లలో ఉన్న భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 84,017 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.97 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Tags:    

Similar News