Tirumala : తిరుమలకు భక్తుల రద్దీ ఈ సీజన్ లో ఎన్నాళ్లో తెలుసా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల రద్దీ తగ్గలేదు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల రద్దీ తగ్గలేదు. తిరుమల కొండకు వచ్చే భక్తుల సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరగడంతో ఆలయ అధికారుల అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వారంతో సంబంధం లేకుండా తిరుమలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. కేవలం హుండీ ఆదాయం మాత్రమే కాదు. లడ్డూల విక్రయాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.
దేశం నలుమూలల నుంచి...
తిరుమలకు గత కొంతకాలంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. అయితే తమిళనాడులో పెరటాసి మాసం నడుస్తుండటంతో ఆ రాష్ట్రం నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. వారు మాత్రమే కాకుండా దేశం నలుమూలల నుంచి తిరుమలకు వచ్చేభక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతుండటంతో అవి ఇంటి వద్ద ముగించుకుని శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో వసతి గృహాలు కూడా సులువుగా దొరకడం లేదు. అయినా భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 23 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూలైన్ లోకి ప్రవేశించిన టోకెన్ లేని భక్తులకు 12 గంటల సమయం పట్టే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,569గా ఉంది. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,482 గా ఉంది. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్ల రూపాయలు వచ్చింది.