Tirumala : తిరుమలలో శ్రీవారి దర్శనం సులువుగా.. ఎంత సమయమో తెలిస్తే?

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తుల సంఖ్య తక్కువగా ఉంది

Update: 2025-10-28 03:18 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. అంటే నిన్నటి వరకూ అధిక సంఖ్యలో భక్తులు తిరుమలు తరలి వచ్చారు. అయితే మొంథా తుపాను ప్రభావంతో పలు రైళ్లు, విమానాలు రద్దు కావడంతో పాటు భారీ వర్ష సూచనలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో తిరుమలలో భక్తుల రద్దీ చాలా వరకూ తగ్గింది. భక్తులు స్వామి వారిని సులువుగానే దర్శనం చేసుకుంటున్నారు. తక్కువ సమయంలో పెద్దగా వేచి ఉండకుండానే స్వామి వారి దర్శనం లభిస్తుందని భక్తులు చెబుతున్నారు.

మొంథా తుపాను ఎఫెక్ట్...
మొంథా తుపాను ఎఫెక్ట్ తిరుమలపైన కూడా పడింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో పాటు వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో భక్తులు తిరుమలకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. అయితే ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రం వస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు ఘాట్ రోడ్ లో ప్రయాణం ప్రమాదకరంగా ఉంటుందని, జాగ్రత్తగా తిరుమలకు చేరుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరుతున్నారు.
నాలుగు కంపార్ట్ మెంట్లలోనే ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉదయం సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల్లో పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం మాత్రమే పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,842 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో s : 25,125 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.47 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.



Tags:    

Similar News