Tirumala : తిరుమల స్వామి వారిని కనులారా చూసేందుకు ఇదే మంచి రోజు

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది. ఆదివారమయినా భక్తుల రద్దీ పెద్దగా లేదు

Update: 2025-09-21 03:34 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది. ఆదివారమయినా భక్తుల రద్దీ పెద్దగా లేదు. నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో ఇక భక్తుల రద్దీ పెరిగే అవకాశముంది. భక్తులు నేడు తక్కువ సంఖ్యలో ఉండటంతో స్వామి వారి దర్శనం సులువుగానే దొరుకుతుంది. భక్తులు కనులారా స్వామి వారిని చూసి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. వసతి గృహాలు కూడా నేడు సులువుగానే లభిస్తున్నాయి. తిరిగి రేపటి నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

నాలుగు నెలల నుంచి...
తిరుమల శ్రీవారిని చూసేందుకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. గత నాలుగు నెలల నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుంది. సహజంగా ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే రేపటి నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో వాటిని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశముందని అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి తిరుమలకు భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
ఎనిమిది గంటల సమయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం మాత్రమే పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,042 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,393 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.59 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News