Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందో తెలుసా?

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు.

Update: 2025-09-02 03:18 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. గత ఐదు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే కనిపిస్తుంది. ఆగస్టు మూడో వారం వరకూ తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కంపార్ట్ మెంట్లన్నీ ఫుల్లయ్యాయి. బయట వరకూ క్యూ లైన్లు ఏర్పడ్డాయి. దర్శనం కావాలంటే ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది. అటువంటి తిరుమలకు గత కొద్ది రోజులుగా భక్తుల రద్దీ తగ్గుతుందని, అయినా ఆదాయం మాత్రం బాగా వస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

సిఫార్సు లేఖలు రద్దు...
ఈ నెల 8,9 తేదీల్లో వీఐపీ సిఫార్సు లేఖలను అనుమతించబోమని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఉండటంతో ఎనిమిది, తొమ్మిదో తేదీల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఏడో తేదీ మధ్యాహ్నం నుంచి తిరుమల ఆలయాన్ని మూసివేయనున్నారు. దాదాపు పన్నెండు గంటల సమయం ఆలయ తలుపులు తెరుచుకోవు. అందుకే మరుసటి రోజైన ఎనిమిది, తర్వాత రోజైన తొమ్మిదో రోజున వీఐపీ సిఫార్సు లేఖలను అనుమతించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం ముందే ప్రకటించారు.
ఆరు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,384 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,512 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.03 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.



Tags:    

Similar News