Tirumala : నేడు తిరుమలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. వెంటనే దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

Update: 2025-11-27 03:09 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ కొంత గతంలో కంటే తక్కువగానే ఉంది. నిన్నటి వరకూ స్వామి వారి దర్శనానికి గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఇరవై కంపార్ట్ మెంట్లకు పైగానే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండేవారు. కానీ నేడు కొంత రద్దీ తగ్గింది. కానీ రేపు శుక్రవారం కావడంతో మళ్లీ భక్తుల రద్దీ పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో నెలకొన్న రద్దీ బుధవారం కొనసాగింది.

నేటి నుంచి వైకుంఠ ఏకాదశి...
నేటి నుంచి వైకుంఠ ఏకాదశి టికెట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. మొదటి మూడు రోజులకు డిసెంబర్‌ 2వ తేదీన లక్కీడిప్ తీయనున్నారు. తిరుమలలో డిసెంబర్‌ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. అయితే ఈసారి కేవలం ఆన్ లైన్ లోనే భక్తులకు వైకుంఠ ఏకాదశి టోకెన్లను విడుదల చేయనున్నారు. వారిలో లక్కీడిప్ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఈసారి ఎనిమిది లక్షల మందికి దర్శనం కల్పించాలన్న లక్ష్యంతో పాటు, సామాన్య భక్తులకు అవకాశం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎనిమిది కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని ఎనిమిది కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,670 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,062 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Tags:    

Similar News