Tirumala : తిరుమలకు ఎప్పుడు వెళితే శ్రీవారిని తనివి తీరా చూడొచ్చంటే?

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు

Update: 2025-08-04 02:49 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు. గత కొద్దిరోజలుగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుక నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అయితే ఆగస్టు నెల ప్రారంభం నుంచి కొంత భక్తుల రద్దీ తగ్గుతూ వస్తుంది. మే పదిహేనో తేదీ నుంచి జులై నెలాఖరు వరకూ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింది. తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

సీజన్ తో సంబంధం లేకుండా....
గతంలో తిరుమలలో కేవలం వేసవి కాలంలోనే భక్తులతో రద్దీగా కనిపించేది. కానీ ఈరోజుల్లో రద్దీకి ఒక సీజన్ లేకుండా పోయింది. నిరంతరం భక్తుల రాకతో తిరుమల వీధులన్నీ కళకళలాడుతున్నాయి. గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. తిరుమలలో ఎంత మంది భక్తులు వచ్చినా వారికి స్వామి వారి దర్శనం సులువుగా లభించేలా చర్యలు తీసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలతో పాటు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
ఆరు కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఆరు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,628 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,339 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.25 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News