ఒక్కసారిగా పెరిగిన రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి

Update: 2023-09-22 02:57 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బ్రహ్మోత్సవాలు జరుగుతుండటం, వీకెండ్ రావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. నిన్నటి వరకూ అంతగా భక్తుల సంఖ్యలేని క్యూలైన్లు నేడు నిండిపోయాయి. బ్రహ్మోత్సవాలను వీకెండ్ వీక్షించేందుకు అధిక మంది భక్తులు తరలి వచ్చారు.

బయట వరకూ...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూ లైన్ బయట టీబీసీ వరకూ ఉంది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,462 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,241 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.77 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News