Tirumala : నేడు తిరుమలకు వెళుతున్నారా? అయితే అలెర్ట్ గా ఉండాల్సిందే?
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ ఒక్కసారిగా పెరిగింది. మంగళవారం అయినా భక్తుల రద్దీ మరింతగా పెరిగింది.
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ ఒక్కసారిగా పెరిగింది. మంగళవారం అయినా భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలతో నిన్న కొంత భక్తుల రద్దీ తగ్గినట్లు కనిపించినా నేడు మాత్రం మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. దీంతో సామాన్య భక్తులు కంపార్ట్ మెంట్లలో ఇబ్బందిపడకుండా సులువగా దర్శనం అయ్యేలా టీటీడీ అధికారులు తగిన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
గత కొద్ది రోజుల నుంచి...
తిరుమలకు గత కొద్ది రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శ్రావణ మాసం కావడంతో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతుండటంతో వాటిని పూర్తి చేసుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. కొత్తగా పెళ్లయిన జంటలు కూడా వస్తుండటంతో తిరుమలలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. భారీ వర్షాలతో పాటు వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఘాట్ రోడ్డులో జాగ్రత్తగా ప్రయాణం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు సూచిస్తున్నారు.
ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,740 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,958 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.84 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.