Tirumala : ఇంత పెద్ద క్యూనా..? తిరుమలకు నేడు వెళ్లేవారికి మాత్రం? వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గత పది రోజుల నుంచితిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది.

Update: 2024-05-25 04:29 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గత పది రోజుల నుంచితిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. శుక్ర, శని, ఆదివారాలు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. ఈరోజు శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది. అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

హుండీ ఆదాయం...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,688 మందిభక్తుల దర్శించుకున్నారు. ఈరోజు భక్తుల సంఖ్య దీనికంటే అధికంగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపారు. నిన్న తిరుమ శ్రీవారి హుండీ ఆదాయం 3.64 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News