Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. నేడు తిరుమలకు వెళుతున్నారా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. భారీ వర్షాలు పడుతున్నా భక్తుల రాక తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. తిరుమలకు భక్తులు క్యూ కడుతుండటంతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి కనిపిస్తున్నాయి. మాడవీధుల్లోనూ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతుంది. తిరుమలకు భక్తుల రాక గత మూడు నెలలకు పైగానే కొనసాగుతుంది. సీజన్ తో సంబంధం లేకుండా వారాలతో నిమిత్తం లేకుండా తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
లడ్డూల విక్రయం...
అయితే గత కొద్ది రోజులుగా పోలిస్తే ఈరోజు తిరుమలలో కొంత భక్తుల రద్దీ సాధారణంగానే ఉన్నప్పటికీ వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. గత మూడు నెలల నుంచి లడ్డూల విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో విక్రయించామని అధికారులు చెబుతున్నారు. అలాగే రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం కూడా వచ్చిందని తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వచ్చిన వారందరికీ సులువుగా దర్శనం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
పదిహేను గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,688 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,099 మంది భక్తుుల తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.45 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.