Tirumala : తిరుమలకు వెళ్లే వారికి తీపికబురు.. ఈ నెలలో దర్శనం చేసుకుంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ కొంత పెరిగింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ కొంత పెరిగింది. గత కొద్ది నెలలుగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పండగలు, కార్తీక మాసం, బ్రహ్మోత్సవాలు, వేసవి సెలవులతో మే నెల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. అదే సమయంలో కార్తీకమాసంలో తిరుమలవెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే శుభప్రదమని విశ్వసిస్తారు. ఇక వచ్చే నెల నుంచి సెలవులు, పండగలు కూడా ప్రారంభం కానుండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వైకుంఠ ద్వార దర్శనాలు కూడా ఉండటంతో ఎక్కువ మంది తిరుమలకు వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ప్రతి రోజూ ఎనభై వేల మంది...
తిరుమలకు ప్రతి రోజూ ఎనభై వేలకు మందికి పైగా భక్తులు వచ్చి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు టీటీడీ అధికారులు చేపట్టారు. క్యూ లైన్ లు మొన్నటి వరకూ కిలోమీటర్ల వరకూ బయట వరకూ విస్తరించింది. గంటల తరబడి క్యూ లైన్ లో స్వామి వారిని దర్శించుకున్న రోజులున్నాయి. అదే సమయంలో ఒక్కోరోజు ఏడుకొండల వాడి దర్శనానికి 24 గంటల సమయం కూడా పట్టింది. ఇక హుండీ ఆదాయం కూడా గణనీయంగా గత కొద్ది రోజులుగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇరవై నాలుగు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు నేడు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుదంని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62,129 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,026 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.