Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందో తెలిస్తే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేడు దసరా కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

Update: 2025-10-02 02:53 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేడు దసరా కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈరోజుతో బ్రహ్మోత్సవాలు ముగియనుండటంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఈరోజు తిరుమలకు వచ్చే భక్తులకు సులువుగా దర్శనం కల్పించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. క్యూ లైన్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.

బ్రహ్మోత్సవాలు నేటితో...
తిరుమలలో నేటితో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. స్వామివారికి ఉదయం పల్లకి, తిరుచ్చి ఉత్సవం జరిపిన అనంతరం స్వామివారికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. ఈరోజు రాత్రి 7 గంటలకు స్వామివారికి ధ్వజావరోహణం చేస్తారు. ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల దృష్ట్యా పలు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వదర్శనం, ఎస్.ఎస్.డి టోకెన్లు మాత్రం టీటీడీ అధికారులు పంపిణీ చేస్తున్నారు.
ఇరవై నాలుగు గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట రెండు కిలోమీటర్ల వరకూ క్యూ లైన్ విస్తరించింది.శిలాతోరణం వరకూ క్యూ లైన్ విస్తరించింది. ఈరోజు సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనానికి ఏడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,247 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,738 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.71 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News