Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా? వెళితే వెయిటింగ్ టైం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతుంది. నేడు శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది

Update: 2025-09-19 02:46 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతుంది. నేడు శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. సాధారణ రోజుల్లో కూడా శుక్రవారం నుంచి ఆదివారం వరకూ తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సెలవులు వరసగా వస్తుండటంతో పాటు ముందుగా బుక్ చేసుకున్న వారితో పాటు వివిధ మార్గాల్లో వచ్చిన వారు తిరుమలకు చేరుకుంటుండటంతో భక్తుల రద్దీ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు తరలి వస్తుండటంతో తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

సీజన్ లేకుండా...
తిరుమలకు ఒక సీజన్ అంటూ లేకుండా పోయింది. గతంలో వేసవిలో మాత్రమే ఎక్కువ రద్దీ ఉండేది. అయితే ఇప్పుడు దేశం నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరుగుతుంది. నెలకు దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగానే వస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. పండగలు, సెలవులు మాత్రమే కాకుండా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వారంలో ఏడు రోజుల పాటు తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారు.
ఇరవై గంటల సమయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 68,095 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,932 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.70 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Tags:    

Similar News