Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా? అయితే రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో సహజంగానే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది

Update: 2025-09-13 02:21 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో సహజంగానే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు శనివారం శుభప్రదమని అందరూ విశ్వసిస్తారు. అందుకే శనివారం స్వామి వారికి అత్యంత ఇష్టమైన రోజు అని అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకునే వారు కూడా శనివారం ఆన్ లైన్ లో ప్రత్యేక దర్శనం టిక్కెట్లు లభిస్తే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదని విశ్వసిస్తారు. దీంతో పాటు శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో ఎక్కువ మంది తిరుమలకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటుంటారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

గత కొద్ది రోజులుగా...
తిరుమలలో గత కొద్ది రోజులుగా తిరిగి రద్దీ పెరిగింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రద్దీ నేడు కూడా ఉంది. ఇక ఈ నెలాఖరులో దసరా సెలవులు వస్తుండటంతో పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలను చూసేందుకు అధిక సంఖ్యలో తిరుమలకు భక్తులు చేరుకుంటారు. బ్రహ్మోత్సవాలకు సంబంధిని ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు మొదలు పెట్టారు. స్వామి వారి వాహనసేవలను మాడ వీధుల్లో నిర్వహించనుండటంతో ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో వాహనసేవలను తిలకించేందుకు భక్తులు వస్తారని, అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తాగునీరు, అన్న ప్రసాదం, స్వామి వారి లడ్డూల విషయంలోనూ మరింత ఎక్కువ చేయాలని ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్ణయించారు.
అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో...
ఈరో్జు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూ లైన్ భక్తులతో నిండిపోయింది. ఈరోజు సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం పన్నెండు నుంచి పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 69,842 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,234 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.




Tags:    

Similar News