Tirumala : తిరుమలకు వెళుతున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినప్పటికీ భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది

Update: 2025-09-09 03:11 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినప్పటికీ భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. చంద్ర గ్రహణం తర్వాత భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. దీంతో పాటు రోజువారీగా వచ్చే భక్తులతో పాటు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులు, సర్వదర్శనం క్యూ లైన్ ల నుంచి అప్పటికప్పుడు వచ్చే భక్తులు, ఎస్.ఎస్.డి టోకెన్లు తీసుకున్న భక్తులతో రద్దీ గా మారింది.

లడ్డూలు రోజుకు నాలుగు లక్షలుగా....
తిరుమలలో వసతి గృహాలు సలువుగానే లభిస్తున్నాయి. శ్రీవాణి టిక్కెట్లను కొనుగోలు చేసిన వారు కూడా నిత్యం తిరుమలకు చేరుకుంటున్నారు. అదే సమయంలో మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ముందుగానే ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తులు కూడా తిరుమలకు చేరుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో లడ్డూ విక్రయాలు రోజుకు నాలుగు లక్షల పైగానే జరుగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అదే సమయంలో ఎంత మంది భక్తులు వచ్చినా దర్శనం అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
పది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 77,117 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,765 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నార. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.10 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.



Tags:    

Similar News