Telangana : తిరుమలకు నేడు వెళుతున్నారా? అయితే అలెర్ట్ గా ఉండాల్సిందే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారంతో పాటు ఆఖరి శ్రావణ శుక్రవారం కూడా కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారంతో పాటు ఆఖరి శ్రావణ శుక్రవారం కూడా కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. తిరుమల నిత్యం రద్దీగానే ఉంటుంది. భక్త జనం సంద్రంగానే మారుతుంది. నిత్యం రద్దీగానే ఉంటుంది. గత కొద్ది రోజులుగా భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగా కనిపిస్తుంది. లడ్డూల విక్రయాల నుంచి అన్నదానం వరకూ ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపిస్తుంది. భక్తుల రద్దీకి తగినట్లుగానే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
క్యూ లైన్ల వద్దనే...
కంపార్ట్మెమెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ నిండిపోయి ఉన్నప్పుడు భక్తులకు క్యూ లైన్ల వద్ద పన్నెండు కౌంటర్లు పెట్టి ఉచితంగా అన్న ప్రసాదాలను, మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. శ్రీవారి సేవకులను వినియోగించుకుని భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు క్యూ లైన్ లో ఉండటంతో భక్తులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నామని, త్వరలోనే ఏఐ ద్వారా రెండు, మూడు గంటల్లో స్వామి వారి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణతేజ అతిథి గృహం వరకూ భక్తుల క్యూ లైన్ నిండిపోయింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,112మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,331 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.49 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.