Tirumala : తిరుమలకు వెళుతున్నారా? అయితే దర్శనానికి మీరు వేచి ఉండే సమయం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు

Update: 2025-08-18 03:07 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు. శుక్రవారం నుంచి వరస సెలవులు రావడంతో తిరుమలకు భక్తుుల పోటెత్తారు. అయితే భక్తులు వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వేచి ఉండటంతో నేడు కూడా భక్తులు బారులు తీరారు. తిరుమలకు ఇటీవల కాలంలో భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఏ మాత్రం తగ్గలేదు. వారంతో సంబంధం లేకుండా భక్తులు తిరుమలకు చేరుకుంటుడటంతో వారికి సులువుగా దర్శనం అయ్యేలా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

అనేక రూపాల్లో...
తిరుమలకు వచ్చే భక్తులు వివిధ రూపాల్లో వస్తారు. సిఫార్సులేఖలను తీసుకుని వచ్చే వారు కొందరయితే.. అప్పటికప్పుడు తిరుమలకు వచ్చి ఎస్.ఎస్.డి. టోకెన్లు తీసుకుని దర్శనం చేసుకునే వారు మరికొందరు. ఇంకొందరు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుని స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటున్నారు. ఇక మొక్కులు చెల్లించుకునేందుకు కాలినడకన తిరుమలకు చేరుకునే వారు అనేక మంది ఉంటారు. ఈ నేపథ్యంలోనే తిరుమలకు వచ్చే వారి భక్తుల సంఖ్య పెరిగింది. హుండీ ఆదాయం కూడా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించి ఉంది. తిరుమలలో నేడు ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 86,364 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,712 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.46 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Tags:    

Similar News