Tirumala : తిరుమలకు నేడు వెళ్తున్నారంటే.. అలెర్ట్ గా ఉండాల్సిందే

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేడు శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది

Update: 2025-07-18 03:03 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేడు శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. తిరుమలకు గత రెండున్నర నెలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆపదమొక్కుల వాడి చెంత మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరుతున్నారు. కొండ మీదకు వచ్చే వారితో ట్రాఫిక్ సమస్యలు కూడా పెరిగాయి. తిరుమలలో ప్రయివేటు వాహనాల పార్కింగ్ సమస్య కూడా ఎక్కువగా ఉంది. కార్లు నిలిపేందుకు సమస్య ఎదురవుతుంది. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది.

వసతి గృహాలు కూడా...
గత రెండున్నర నెలల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ప్రతి రోజూ భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ లు విస్తరించి ఉన్నాయి. తిరుమలలో ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపిస్తుంది. తిరుమలలో వసతి గృహాలు దొరకడం కష్టంగా మారడంతో తిరుపతిలోనే గదులు తీసుకుని కొండపైకి చేరుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు సర్వదర్శనం క్యూ లైన్ లలో కూడా రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలా తోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటలకుపైగా సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 63,897 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,500 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.66 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.






Tags:    

Similar News