కాశీనాయన క్షేత్రానికి నిలిచిన ఆర్టీసీ బస్సులు

కాశీనాయన జ్యోతి క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి

Update: 2025-06-27 07:34 GMT

కాశీనాయన జ్యోతి క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. అటవీశాఖ అధికారుల ఆదేశాలతో బస్సులు నిలిపివేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దీంతో కాశినాయన క్షేత్రానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సొంత వాహనాల్లో వచ్చే వారు తప్ప ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో కాశీనాయన క్షేత్ర నిర్వాహకులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ప్రభుత్వం ఆలోచించాలని...
గతంలోకాశినాయన జ్యోతిక్షేత్రం దగ్గర అటవీ శాఖ అధికారులు కూల్చివేశారు. దీనిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేయడంతో వెంటనే ప్రభుత్వం స్పందించింది. అన్నదాన సత్రాలను సొంత డబ్బుతో మంత్రి నారా లోకేష్ పున:నిర్మించారు. ప్రస్తుతం మరోసారి ఆర్టీసీ బస్సు సర్వీసులను అటవీశాఖ అడ్డుకోవడంతో ఆందోళన చెంతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Tags:    

Similar News