ఏలూరులో రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్ లో వచ్చి ముగ్గురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో యువకులు బైకు పై వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.
ద్వారకా తిరుమలకు చెందిన...
మృతులు ముగ్గురు ద్వారకా తిరుమలకు చెందిన వారుగా గుర్తించారు. మృతులను బన్నీ, చరణ్, రఫీలుగా పోలీసుల తెలిపారు. ప్రమాదం సంగతి తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాంగ్ రూట్ లో రావడమే ముగ్గురి ప్రాణాలు తీసిందని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.