Liquor Shops : మందుబాబులకు షాకిస్తున్న ఏపీ సర్కార్.. రీజన్ ఇదేనట

ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపుల సమయంపై ఆంక్షలు విధించారు. మద్యం అమ్మకాలను తగ్గించారు

Update: 2024-04-10 06:24 GMT

ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపుల సమయంపై ఆంక్షలు విధించారు. మద్యం అమ్మకాలను తగ్గించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఏపీలో మద్యం షాపులన్నింటినీ ప్రభుత్వమే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు పరిమితంగానే మద్యం విక్రయించాలన్న నిబంధనలను ఎక్సైజ్ శాఖ అధికారులు అమలు చేస్తున్నారు. ఎన్నికల వేళ మద్యం పంపిణీ కీలకంగా మారనుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ముందుగానే మూసి వేస్తూ...
కొన్ని షాపుల్లో స్టాక్ అయిపోవడంతో వాటిని మూసివేస్తున్నారు. అనేక మద్యం దుకాణాలను ఇప్పటికే తొలగించారు. రాత్రిపూట కూడా త్వరగానే మూసివేస్తుండటంతో మద్యం ప్రియులు అక్కడకు వచ్చి సిబ్బందితో ఘర్షణ పడుతున్నారు. గత ఏడాది ఇదే నెలలో ఏ దుకాణంలో ఎంత మేరకు విక్రయాలు జరిగాయో అంతే మేర అమ్మకాలు జరపాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. దీంతో తమ రోజువారీ షాపు విక్రయాలు పరిమితి దాటితే మూసివేస్తున్నారు.


Tags:    

Similar News