సాగర్ నుంచి నీటి విడుదల చేసుకున్న ఏపీ.. తెలంగాణ అభ్యంతరం

నాగార్జున సాగర్ కుడి కాల్వకు నీటిని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేయడం ఇప్పుడు మరో వివాదానికి దారి తీసింది.

Update: 2025-07-24 04:50 GMT

నాగార్జున సాగర్ కుడి కాల్వకు నీటిని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేయడం ఇప్పుడు మరో వివాదానికి దారి తీసింది. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు సమాచారం అందించకుండా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేయడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతుంది.

పోతిరెడ్డి పాడు ద్వారా...
పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికే యాభై టీఎంసీల నీటిని విడుదల చేసుకున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అధికారులు వ్యవహరించిన తీరును తప్పుపడుతూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేయనున్నారు. నిబంధనలను ధిక్కరించడమేనని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.


Tags:    

Similar News