ఈస్ట్ గోదావరిలో రేవ్ పార్టీ కలకలం

తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపింది. బూరుగపూడి గేట్ సమీపంలో రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

Update: 2024-12-30 05:52 GMT

తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపింది. కోరుకొండ మండలం బూరుగపూడి గేట్ సమీపంలో రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందడంతో కల్యాణమండపంలో తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేసిన తనిఖీలు చేశారు. ఐదుగురు మహిళలతోపాటు మరో పథ్నాలుగు మంది యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

కొత్త సంవత్సరం వేడుకలకు...
నూతన సంవవత్సరం సందర్భంగా ఒక ఫర్టిలైజర్స్ కంపెనీ ఈ ఈవెంట్ ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు ప్రాధమిక విచారణలో తేలినట్లు చెబుతున్నారు. రేవ్ పార్టీలో ఖరీదైన మద్యం బాటిళ్లను గుర్తించారని, వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టబడినవారంతా ఫర్టిలైజర్స్ కంపెనీ యజమానులని, వీరంతా కోస్తాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినట్లు తెలిసింది.



Tags:    

Similar News